డిల్లీ, 22 జూలై (హి.స.)ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా సమర్పించగా.. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దానికి ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనారోగ్య కారణాలతో ధన్‌ఖడ్ రాజీనామా చేయగా.. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు