ధన్‌ఖర్ రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు
ఢిల్లీ, 22 జూలై (హి.స.) ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడం రాజకీయ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ధన్‌ఖర్ ఉల్లాసంగానే కనిపించారు. అలాగే ఆయా పార్టీలకు చెందిన నాయకులతో కూ
ధన్‌ఖర్ రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు


ఢిల్లీ, 22 జూలై (హి.స.)

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేయడం రాజకీయ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో ధన్‌ఖర్ ఉల్లాసంగానే కనిపించారు. అలాగే ఆయా పార్టీలకు చెందిన నాయకులతో కూడా ఉత్సాహంగానే సమావేశాలు నిర్వహించారు. కానీ సాయంత్రానికి ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్‌ఖర్ ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అనారోగ్య కారణాల చేత పదవి నుంచి వైదొలగుతున్నట్లు వెల్లడించారు.

అయితే ధన్‌ఖర్ రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదో బలమైన కారణం ఉండొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande