ఈ పండు తింటే అరగంటలో కడుపు క్లీన్.. వారం రోజులు తిన్నారంటే ఊహించని బెనిఫిట్స్..!
కర్నూలు, 22 జూలై (హి.స.) గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో హిస్టమైన్ ఉత్పత్తిని నిరోధించి, అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది. అంతేకాదు.. పీచ్‌ పండుతో అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. పండులో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండుతో ఫ
ఈ పండు తింటే అరగంటలో కడుపు క్లీన్.. వారం రోజులు తిన్నారంటే ఊహించని బెనిఫిట్స్..!


కర్నూలు, 22 జూలై (హి.స.)

గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో హిస్టమైన్ ఉత్పత్తిని నిరోధించి, అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది. అంతేకాదు.. పీచ్‌ పండుతో అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. పండులో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండుతో ఫేషియల్ చేయడం వల్ల చర్మం ముడతలు తొలగిపోయి, చర్మ రంధ్రాలలోని మలినాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా, మెరుస్తూ ఉంటుంది.

పీచ్‌ పండు.. దీనినే స్టోన్ ఫ్రూట్, పర్షియన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. పసుపు, తెలుపు రంగులో ఉండే ఈ పండుతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని జ్యూస్ రూపంలో నేరుగా కూడా తింటారు. పీచ్‌ పండులో విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పీచ్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అధిక తినాల్సిన కోరిక రాదు. అయితే ఇది జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.. అంతేకాదు డయేరియా, మలబద్దక సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి పిచ్‌ అద్భుతమైన ఎంపిక అంటున్నారు నిపుణులు. పిచ్‌ పండులో కేలరీలు తక్కువగా ఉండటం కారణంగా బరువు నియంత్రణలో ఉంచుకొవచ్చు అంటున్నారు నిపుణులు. పోషకాలు పుష్కలంగా ఉంది, ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పండు కంటి ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పిచ్‌ పండులో విటమిన్ ఏ తో పాటు బీటా కెరోటీన్‌ కూడా పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన కంటి చూపును మెరుగుపరిచి ఇది క్యాటరాక్ట్ సమస్యలు రాకుండా నివారిస్తుంది.

పీచ్‌ పండు క్యాన్సర్ కణాలు అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ఈ పండు రక్తపోటును, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో హిస్టమైన్ ఉత్పత్తిని నిరోధించి, అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande