మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..
ముంబై, 22 జూలై (హి.స.)పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే లక్షకుపైగా చేరుకున్న ధరలు ఇంకాస్తా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, జులై 22, 2025న ఉదయం 6:20 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగి రూ.1
Gold


ముంబై, 22 జూలై (హి.స.)పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పటికే లక్షకుపైగా చేరుకున్న ధరలు ఇంకాస్తా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, జులై 22, 2025న ఉదయం 6:20 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగి రూ.1,00,160కి చేరుకుంది. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,810కి చేరింది. ఈ ధరల (Gold Rates Today on july 22nd 2025) పెరుగుదలకు కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం వంటి పలు అంశాలు కీలక పాత్ర పోషించాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,810.

విజయవాడ: హైదరాబాద్‌తో సమానంగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం రూ.91,810.

ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,310, 22 క్యారెట్ల బంగారం రూ.91,960.

ముంబై: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం రూ.91,810.

చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం రూ.91,810.

కోల్‌కతా: 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,510, 22 క్యారెట్ల బంగారం రూ.91,230.

బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,160, 22 క్యారెట్ల బంగారం రూ.91,810.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande