అమెరికా కంపెనీల్లో భారతీయులకు ఉద్యోగాలివ్వొద్దు.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్, 24 జూలై (హి.స.) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఆపరేషన్ సిందూర్ విషయంలో క్రెడిట్ కోసం పాకులాడుతున్న ఆయన ఈసారి భారతీయ ఉద్యోగులపై విషo చిమ్మారు. అమెరికన్ టెక్ సంస్థలు భ
ట్రంప్ వివాదాస్పద


హైదరాబాద్, 24 జూలై (హి.స.)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ విషయంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఆపరేషన్ సిందూర్ విషయంలో క్రెడిట్ కోసం పాకులాడుతున్న ఆయన ఈసారి భారతీయ ఉద్యోగులపై విషo చిమ్మారు. అమెరికన్ టెక్ సంస్థలు భారతీయులను నియమించకోవద్దంటూ కామెంట్స్ చేశారు. తాజాగా వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో మాట్లాడిన ఆయన.. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని ఏఐ రేసులో గెలవాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం అన్నారు. అమెరికన్ టెక్ కంపెనీలు అమెరికాకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గూగుల్, మైక్రోసాప్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికర్లను రిక్రూట్ చేసుకోవడంపై దృష్టి సారించాలన్నారు. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ ను ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. చాలా మంది అమెరికన్లలో తమను పట్టించుకోవడం లేదన్న భావన ఉంది. ఇక్కడ లభించిన స్వేచ్ఛను ఉపయోగించుకుని కొన్ని కంపెనీలు చైనా, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక్కడ మాత్రం ఐర్లాండ్ ను అడ్డంపెట్టుకుని తక్కువ లాభాలు చూపుతున్నాయని మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande