అశ్లీల కంటెంట్ ను కంట్రోల్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..25 రకాల యాప్స్, వెబ్ సైట్ లు బ్యాన్.
హైదరాబాద్, 25 జూలై (హి.స.) అశ్లీల కంటెంట్ ను కంట్రోల్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అడల్ట్ కంటెంట్ ను ఎక్కువగా పబ్లిష్ చేస్తున్న ఉల్లూ సహా 25 రకాల యాప్స్, వెబ్ సైట్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ యాప్స
యాప్స్, వెబ్ సైట్


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

అశ్లీల కంటెంట్ ను కంట్రోల్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అడల్ట్ కంటెంట్ ను ఎక్కువగా పబ్లిష్ చేస్తున్న ఉల్లూ సహా 25 రకాల యాప్స్, వెబ్ సైట్లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

ఆ యాప్స్, వెబ్ సైట్స్ అందుబాటులో ఉండకుండా బ్యాన్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వెబ్ సైట్లు, యాప్స్ అన్నీ ఇక నుంచి ఇండియాలో కనిపించవు. ఇప్పటికే మన దేశంలో పోర్న్ సైట్లపై బ్యాన్ ఉంది. కానీ ఓటీటీల పేరుతో విచ్చలవిడిగా ఈ యాప్స్, వెబ్ సైట్లలో పోర్న్ కంటెంట్ ఎక్కువగా పబ్లిష్ అవుతోంది. వీటిపై ఇప్పటికే చాలా కంప్లయింట్లు వచ్చాయి. చిన్న పిల్లలు, టీనేజర్స్ ఎక్కువగా వీటికి అడిక్ట్ అవుతున్నరనే ఫిర్యాదులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande