ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత, “సిక్ లీవ్లు” పెట్టిన 112 మంది పైలట్లు.. రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ, 24 జూలై (హి.స.) గత నెలలో అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా మొత్తం మంది చనిపోయారు. విమానంలో ఉన్న వారితో పాటు కింద ఉన్న వారితో సహా 270 మంది మరణించా
ఎయిర్ ఇండియా రీఫండ్


న్యూఢిల్లీ, 24 జూలై (హి.స.)

గత నెలలో అహ్మదాబాద్ నుండి

లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాలకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా మొత్తం మంది చనిపోయారు. విమానంలో ఉన్న వారితో పాటు కింద ఉన్న వారితో సహా 270 మంది మరణించారు. బోయింగ్ 787-8 డ్రీమ్నన్ విమానం ప్రమాదానికి గురైంది.

అయితే, ఈ ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత 112 మంది ఎయిర్ ఇండియా పైలట్లు అనారోగ్య కారణాలతో “సిక్ లీవ్లు” తీసుకున్నారని కేంద్రమంత్రి రామ్ మోహన్ నాయుడు గురువారం పార్లమెంట్కు తెలియజేశారు. జూన్ 16న 61 మంది సీనియర్ పైలట్లు, 51 మంది విమాన అధికారులు సెలువుల కోసం అప్లై చేసుకున్నారరని, ముఖ్యంగా ఇంత భయంకరమైన ప్రమాదం తర్వాత వారి మానసిక ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రమంత్రి నొక్కిచెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande