భారత్, యూకే మధ్య వాణిజ్య ఒప్పందం
డిల్లీ/లండన్, 24 జూలై (హి.స.) భారత్, యూకే మధ్య ప్రతిష్టాత్మక ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)’’ కుదిరింది. గురువారం లండన్‌లో ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్ సంతకా
యుకె


డిల్లీ/లండన్, 24 జూలై (హి.స.)

భారత్, యూకే మధ్య ప్రతిష్టాత్మక ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)’’ కుదిరింది. గురువారం లండన్‌లో ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. మూడేళ్లుగా చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. దీంతో, రెండు దేశాలు లబ్ధి పొందనున్నాయి. రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏటా 34 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనేక రంగాల్లో భారతీయులకు వృద్ధి , నైపుణ్యాభివృద్ధి, ఉపాది అవకాశాలకు కొత్త మార్గాలు తెరవడం ద్వారా భారత్ గణనీయమైన ప్రయోజనాలు పొందనుంది.

ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా భారతీయులకు కొన్ని వస్తువులు మరింత చౌకగా మారనున్నాయి. ముఖ్యంగా యూకే నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు చాలా తగ్గుతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande