న్యూఢిల్లీ., 24 జూలై (హి.స.)
గతేడాది తన అభిమాని అయిన 33
ఏళ్ల రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితుడిగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు. దర్శన్తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ కూడా నిందితురాలు. రేణుకాస్వామిని కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి, దారుణంగా చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు దర్శన్కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది.
కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రాథమిక దృష్టితో కూడిన న్యాయ అధికారాన్ని దుర్వినియోగం చేయడం” అని విమర్శించింది. దర్శన్ తూగదీపకు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టును సుప్రీంకోర్టు మందలించింది. బెయిల్ మంజూరు చేయడంలో విచక్షణ ఉపయోగించడంలో విఫలమైందని గత వారం హైకోర్టుకు చెప్పింది.
గురువారం మధ్యాహ్నం జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం హైకోర్టు చేసిన తప్పును తాము చేయబోమని చెప్పింది. హత్య కుట్ర కేసు కాబట్టి మేము దీనిపై కొంచెం తీవ్రంగా ఉన్నామని చెప్పింది. హైకోర్టు డిసెంబర్ 2024 బెయిల్ ఆర్డర్లోని భాషపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..