దిల్లీ, 24 జూలై (హి.స.): ప్రధాని మోడీ అగ్ర రాజ్యం అమెరికాలో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఆగస్టు చివరిలో గానీ.. సెప్టెంబర్ ప్రారంభంలో గానీ SCO సమ్మిట్ కోసం చైనా, జపాన్ కూడా సందర్శించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 80వ సెషన్ జరగనుంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్లే అవకాశం ఉందని.. ఈ సమావేశంలో ప్రసంగించే వక్తల్లో ఒకరిగా పేర్కొన్నారు. తాత్కాలిక వక్తల జాబితాలో సెప్టెంబర్ 26, 2025న ప్రధాని మోడీ ప్రసంగించే పేర్లలో ప్రస్తావించబడింది. ఆయా దేశాల సంప్రదింపుల తర్వాత ఈ జాబితా తయారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించడం ఖాయంగా తెలుస్తోం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ