ముంబయి రైలు పేలుళ్లు.. 12 మంది నిర్దోషులంటూ ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే
దిల్లీ: జూలై (హి.స.)దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2006లో జరిగిన ముంబయి రైలు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని బాంబే హైకోర్టు ఇటీవల నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, హైకోర్టు ఆదేశాల
Supreme Court


దిల్లీ: జూలై (హి.స.)దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2006లో జరిగిన ముంబయి రైలు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని బాంబే హైకోర్టు ఇటీవల నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలైన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

2006 జులై 11న ముంబయి పశ్చిమ రైల్వేలైన్‌లోని పలు సబర్బన్‌ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు (Mumbai Train Blasts) చోటుచేసుకున్నాయి. యావత్‌ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసిన ఈ మారణహోమంలో 189 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబరులో ప్రత్యేక కోర్టు.. 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో బాంబు అమర్చారన్న అభియోగాలపై ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దోషుల్లో కమాల్‌ అన్సారీ అనే వ్యక్తి 2021లో కొవిడ్‌ కారణంగా నాగ్‌పుర్‌ జైల్లోనే మృతి చెందాడు.

ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఆ 12 మందిని నిర్దోషులుగా తేల్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande