ఢిల్లీ, 24 జూలై (హి.స.)పర్యాటకులకు భారీ గుడ్ న్యూస్ షేర్ చేశాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని.. పాస్ పోర్టు ర్యాంకింగ్‌లో గతేడాదితో పోలిస్తే ఎనిమిది స్థానాలు మెరుగుపడిందని తెలిపాడు. గతేడాది ర్యాంక్ 85 ఉండగా.. ఈ ఏడాది 77వ ర్యాంక్ పొందినట్లు చెప్పాడు. ఇకపై 59 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని వివరించారు. ఏ పాస్ పోర్ట్‌తో అయితే ఎక్కువ దేశాలు ఫ్రీగా తిరగవచ్చో.. దాన్ని బేస్ చేసుకుని ర్యాంక్ నిర్ణయిస్తారు. వీటిలో మొదటి ర్యాంక్ సింగపూర్ కాగా.. ప్రపంచంలోని 197 దేశాల్లో 193 దేశాలకు వీసా లేకుండా తిరిగే అవకాశమిస్తుంది. ఇక వెరీ లీస్ట్ ర్యాంక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిగి ఉన్నాయని చెప్పాడు యూట్యూబర్.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి