యూరియా కొరతను నివారించండి
ఢిల్లీ, 25 జూలై (హి.స.) : ఏపీ రైతులకు అవసరమైన యూరియా నిరంతరాయంగా సరఫరా చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు టీడీపీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేట
యూరియా కొరతను నివారించండి


ఢిల్లీ, 25 జూలై (హి.స.)

: ఏపీ రైతులకు అవసరమైన యూరియా నిరంతరాయంగా సరఫరా చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు టీడీపీ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్‌తో కలిసి జేపీ నడ్డాను గురువారం కలిశారు. ఏపీలో యూరియా కొరత సంక్షోభాన్ని తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ‘జూలైలో ఏపీకి 80,515 టన్నుల యూరియా కొరత ఉంది. జూలై ఖరీఫ్‌ ప్రణాళిక ప్రకారం, కేంద్ర ఎరువుల శాఖ ఏపీకి 1.30 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. అయితే, జూలై 18 నాటికి రవాణాలో ఉన్న మెటీరియల్‌తో సహా కేవలం 49,485 టన్నులు మాత్రమే చేరింది. దీంతో 80 వేల టన్నులకు పైగా కొరత ఏర్పడింది. క్రిబ్‌కో, సీఐఎల్‌, ఐపీల్‌ కంపెనీ, గంగవరం పోర్టు నుంచి యూరియా కేటాయింపులు పెంచాలి’ అని టీడీపీ ఎంపీలు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande