రాజ్యసభ ఎంపీగా కమల్‌హాసన్ ప్రమాణస్వీకారం
దిల్లీ: 25 జూలై (హి.స.) మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) శుక్రవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళంలో ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. అంతకుముందు పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఎంపీగా ప్రమాణ
Kamal Hassan


దిల్లీ: 25 జూలై (హి.స.)

మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) శుక్రవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళంలో ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. అంతకుముందు పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఎంపీగా ప్రమాణం చేయనున్నందుకు తానెంతో గర్వపడుతున్నానన్నారు.

కమల్‌ 2018లో ఎంఎన్‌ఎం పార్టీని స్థాపించారు. విపక్ష ఇండియా కూటమిలో ఇది భాగం. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్‌ఎం ప్రచారం చేసింది. 2025 ఎంఎన్‌ఎంకు రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande