సరిహద్దు సమస్యలపై భారత్-చైనా చర్చ.. త్వరలో మరోసారి భేటీ
కర్నూలు, 25 జూలై (హి.స.) అలాగే, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు కూడా బీరకాయ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాలు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. అందువల్ల, కిడ్నీవ్యాధి బాధిత
సరిహద్దు సమస్యలపై భారత్-చైనా చర్చ.. త్వరలో మరోసారి భేటీ


కర్నూలు, 25 జూలై (హి.స.)

అలాగే, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు కూడా బీరకాయ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాలు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. అందువల్ల, కిడ్నీవ్యాధి బాధితులు బీరకాయ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

బాబోయ్.. బీరకాయ వీళ్లకు యమ డేంజర్‌..! తిన్నారంటే అంతే సంగతులు..

బీరకాయ.. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతుంది. దీనిని కొందరు ఇష్టంగా తింటారు. మరికొందరూ దూరం పెడుతుంటారు. కానీ, బీరకాయతో ఎలాంటి వంటకం చేసినా కూడా అది నోటికి మంచి రుచిని అందిస్తుంది. అంతేకాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తక్కువ కేలరీలు కలిగిన బీరకాయలో పీచు పదార్థం, నీటి శాతం సమృద్ధిగా ఉంటుంది. బీరకాయలో విటమిన్ ఎ,సి, బి కాంప్లెక్స్‌తో పాటుగా ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, సోడియం, కాపర్, సెలీనియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇన్నీ పోషకాలు నిండివున్న బీరకాను అయితే, కొందరు మాత్రం పొరపాటున కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు బీరకాయ తినటం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

బీరకాయలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. కానీ, సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు మాత్రం బీరకాయకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వారు బీరకాయ తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. అలెర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా బీరకాయ పట్ల జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.

అలాగే, కొందరికి బీరకాయ పడకపోవచ్చు. దాంతో వారు బీరకాయ తినటం వల్ల చర్మంపై దురద, మంట, వాపు, దద్దర్లు వంటి సమస్యలు వేధించే అవకాశం ఉంది. ఇలాంటి వారు బీరకాయ తినటం వల్ల శరీరంలో దద్దుర్లు, మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటున్నారు. అలాగే, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు కూడా బీరకాయ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాలు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. అందువల్ల, కిడ్నీవ్యాధి బాధితులు బీరకాయ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande