దిల్లీ: 25 జూలై (హి.స.)
భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్‌గా అజయ్ సేథ్‌ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అజయ్ సేథ్ నియామకానికి మంత్రివర్గ నియామకాల సంఘం ఆమోదం తెలిపింది. ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌గా అజయ్ సేథ్ వచ్చే మూడేళ్లు లేదా ఆయనకు 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు కొనసాగుతారని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ సేథ్, ఈ ఏడాది జూన్‌లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నాలుగేళ్ల పాటు పనిచేశాక, పదవీ విరమణ చేశారు. ఈ ఏడాది మార్చిలో దేవాశిష్ పండా పదవీ కాలం ముగిసిన తర్వాత, ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ పదవి నాలుగు నెలల పాటు ఖాళీగానే ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ