దిల్లీ: 25 జూలై (హి.స.)
కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్‌షా గురువారం జాతీయ సహకార విధానాన్ని ప్రకటించారు. పర్యాటకం, ట్యాక్సీ సేవలు, బీమా, సంప్రదాయేతర ఇంధన రంగాల్లో సహకార స్ఫూర్తిని విస్తరించాలని ఈ విధానం పేర్కొంటోంది. ఈ విధానాన్ని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు నేతృత్వంలోని 48 మంది సభ్యుల కమిటీ రూపొందించింది. 2002లో తొలి సహకార విధానాన్ని ప్రకటించిన భాజపా ప్రభుత్వం ఇప్పుడు రెండో విధానాన్నీ రూపొందించిందని అమిత్‌షా విధాన ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో సహకార రంగం వాటాను మూడింతలు చేసి 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో ఈ రంగం కీలక భాగస్వామి కావాలన్న ఆశయాన్ని సాధించాలని ఈ విధానం ఆకాంక్షిస్తోంది. ‘‘2034కల్లా దేశ స్థూల దేశీయోత్పత్తిలో సహకార రంగం వాటా మూడింతలవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ