జనగణన తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు.. డీలిమిటేషన్ పై పిటిషన్‌ తిరస్కరణ
దిల్లీ:25 జూలై (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీలిమిటేషన్‌పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోన
Supreme Court


దిల్లీ:25 జూలై (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీలిమిటేషన్‌పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం, దేశంలో తదుపరి జనాభా లెక్కలు (జనగణన) జరిగే 2026 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు (డీలిమిటేషన్) సాధ్యమని స్పష్టం చేసింది.

ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి తన పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని కోరారు. ఇందులో భాగంగా తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225 సీట్లు పెంపు జరగాలని ఆయన అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు దీనిపై విభిన్నంగా స్పందించింది. పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కాబట్టి, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్నిర్వచనం (డీలిమిటేషన్) 2026 జనగణన తరువాత మాత్రమే సాధ్యమవుతుంది. అప్పటి వరకు ఆ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశమేమీ లేదని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande