రాజస్థాన్‌లో ఘోర విషాదం.. స్కూల్ బిల్డింగ్ కూలి నలుగరు మృతి
ఝలావర్‌,25 జూలై (హి.స.) శుక్రవారం ఉదయం ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా పాఠశాల భవనం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతిచెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పాఠశాల భవనం కూలిపోయిన సమయంలో 60-70 మంది పిల్లలు చిక్కుకున్నట్లు
రాజస్థాన్‌లో ఘోర విషాదం.. స్కూల్ బిల్డింగ్ కూలి నలుగరు మృతి


ఝలావర్‌,25 జూలై (హి.స.)

శుక్రవారం ఉదయం ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా పాఠశాల భవనం కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతిచెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పాఠశాల భవనం కూలిపోయిన సమయంలో 60-70 మంది పిల్లలు చిక్కుకున్నట్లు అనుమానం.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించారు. ప్రస్తుతం నలుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటిదాకా కళ్ల ముందు తిరిగిన పిల్లలు ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో రోదనలు మిన్నింటాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి.. అధికార యంత్రాంగం సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande