శ్రావణమాసం వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం
దిల్లీ:25 జూలై (హి.స.)శ్రావణమాసం ఆరంభం వేళ గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా వారం పాటు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1250 తగ్గగా
gold%201_214_668782fe6347f_371427826.jpg


దిల్లీ:25 జూలై (హి.స.)శ్రావణమాసం ఆరంభం వేళ గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా పెరిగిన బంగారం ధరలు కాస్త దిగొస్తున్నాయి. వరుసగా వారం పాటు పెరిగిన గోల్డ్ రేట్స్.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1250 తగ్గగా.. ఈరోజు రూ.450 తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1360, రూ.490 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (జులై 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,100గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,00,480గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర నేడు రూ.92,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.1,00,480గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.92,250గా.. 24 క్యారెట్ల ధర రూ.1,00,630గా కొనసాగుతోంది. ప్రాంతాల వారీగా బంగారం ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే. నేటి నుంచి శ్రావణమాసం ఆరంభం అయింది. ఈ సమయంలో గోల్డ్ రేట్స్ తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. పండగలు, పెళ్లిళ్ల సీజన్ కాబట్టి రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande