పట్నా: 25 జూలై (హి.స.)
బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాబోయే శాసనసభ ఎన్నికల్ని బహిష్కరించే విషయంపై ఆలోచిస్తామని రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షనేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ గురువారం నొక్కి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘సమయం వచ్చినపుడు కూటమి సభ్యులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో పెద్ద మోసం జరుగుతోంది. నమోదు పత్రాలపై ఓటర్ల తరఫున బూత్ స్థాయి అధికారులే సంతకాలు పెట్టేస్తున్నారు. ఖాళీ ఓటరు నమోదు పత్రాలను చిత్తు కాగితాల్లా వాడుతున్నారు. ఈ అంశాలను లేవనెత్తుతున్న జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు’’ అని తేజస్వీ ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ