న్యూఢిల్లీ,అమరావతి(మహారాష్ట్ర): 26 జూలై (హి.స.) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా పదవీ విరమణ చేసిన తరవాత తాను మరే ఇతర పదవినీ స్వీకరించేది లేదని జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టంచేశారు. శుక్రవారం మహారాష్ట్రలోని తన స్వగ్రామం దారాపుర్‌లో సీజేఐ పర్యటించారు. తన తండ్రి, కేరళ, బిహార్ మాజీ గవర్నర్ ఆర్.ఎస్.గవాయ్ స్మారక చిహ్నం వద్ద ఇతర కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు. నవంబరులో పదవీ విరమణ అనంతరం దారాపుర్, అమరావతి, నాగ్‌పుర్‌లలో ఎక్కువ సమయం గడుపుతానని వెల్లడించారు. గ్రామానికి వచ్చే దారిలో తండ్రి పేరిట మహా ద్వార నిర్మాణానికి సీజేఐ శంకుస్థాపన చేశారు. అమరావతి జిల్లాలోని దర్యాపుర్‌లో కొత్తగా నిర్మించిన కోర్టు భవనాన్ని ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ