న్యూఢిల్లీ, 26 జూలై (హి.స.)
'కార్గిల్ విజయ్ దివస్' సందర్భంగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడిమా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. దేశవాసులకు కార్గిల్ విజయ దివస్ శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేశారు. ఈ సందర్భంలో మన భరతమాత వీర సైనికుల అసమాన ధైర్యం, శౌర్యం గుర్తు చేస్తుంది అని అన్నారు.. వారు దేశ ఆత్మగౌరవ రక్షణ కోసం తమ జీవితాలను అర్పించారని తెలిపారు.
మాతృభూమి కోసం త్యాగం చేసిన వారి ఉత్సాహం ప్రతి తరాన్ని ప్రేరేపిస్తుంది.. జై హింద్ అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
కార్గిల్ యుద్ధం లో భారత సైన్యం సాధించిన విజయాన్ని దేశ ప్రజలు నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీతో పాటు, ఉగ్రమూకలు ఆక్రమించిన జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని కార్గిల్ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇండియాన్ ఆర్మీ 'ఆపరేషన్ విజయ్' చేపట్టింది. ఇందులో భాగంగా శ్రతుమూకలను తరిమికొట్టి తిరిగి ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు. అయితే, ఆపరేషన్లో పాల్గొన్న సైనికుల త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 26న 'కార్గిల్ విజయ్ దివస్'గా భారత ప్రభుత్వం ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..