భారత సైన్యంలో కొత్త శక్తి.. ‘రుద్ర’
న్యూఢిల్లీ,26 జూలై (హి.స.) శత్రుమూకల ఆట కట్టించేలా భారత సైన్యం (Indian Army)లో ఓ శక్తిమంతమైన దళం ఏర్పాటైంది. భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేలా ‘ఆల్‌ఆర్మ్స్‌ బ్రిగేడ్‌’ను ఏర్పాటుచేసినట్లు సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) వె
భారత సైన్యంలో కొత్త శక్తి.. ‘రుద్ర’


న్యూఢిల్లీ,26 జూలై (హి.స.) శత్రుమూకల ఆట కట్టించేలా భారత సైన్యం (Indian Army)లో ఓ శక్తిమంతమైన దళం ఏర్పాటైంది. భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేలా ‘ఆల్‌ఆర్మ్స్‌ బ్రిగేడ్‌’ను ఏర్పాటుచేసినట్లు సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) వెల్లడించారు. దీనికి ‘రుద్ర’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. శనివారం ‘కార్గిల్‌ విజయ్‌ దివస్‌ (Kargil Vijay Diwas)’ సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళులర్పించారు.

భారత సైన్యం ప్రస్తుత సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఈ యూనిట్‌ను ఏర్పాటుచేసినట్లు జనరల్‌ ద్వివేది వెల్లడించారు. పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్లు ఫిరంగిదళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు వంటి వ్యవస్థలతో కూడిన దళం ఇది అని వెల్లడించారు. సరిహద్దులోని శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు ‘‘భైరవ్‌’’ అనే లైట్‌ కమాండో బెటాలియన్‌ యూనిట్లను కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే రెండు పదాతిదళ బ్రిగేడ్‌లు రుద్రలో భాగమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande