అమరావతి, 27 జూలై (హి.స.)పవన్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) ఈనెల 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ విద్యార్థులకు ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ(MLA Bathula Ramakrishna) గుడ్ న్యూస్ చెప్పారు. ‘
నేడు జూలై 27 రోజున 9th, 10th, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థుల కోసం కోరుకొండ, సీతానగరంలో రామకృష్ణ థియేటర్, గీతా సినిమాస్ థియేటర్‌లో హరిహర వీరమల్లు ఫ్రీ షో వేయనున్నారు. మొత్తం రెండు షోలు వేస్తున్నామని, ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ వినియోగించుకోవాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ పిలుపునిచ్చారు. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాకు.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించగా.. సత్యరాజ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో దివంగత నటుడు కోట శ్రీనివాసరావు సైతం కనిపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి