చెన్నై, 15 జూలై (హి.స.) తమిళం నుంచి ఇటీవల థియేటర్లకు 'మనిదర్గళ్' అనే థ్రిల్లర్ సినిమా వచ్చింది. పోస్టర్స్ దగ్గర నుంచే అందరిలోను ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. దాంతో రిలీజ్ కి ముందు మంచి బజ్ వచ్చింది. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, ఒక కొత్త ప్రయత్నం అనిపించుకుంది. మే 30వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి, రామ్ ఇంద్ర దర్శకత్వం వహించాడు.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమాను 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కపిల్ వేలవన్ .. దశ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, గుణవంతన్ .. అర్జున్ దేవ్ .. శరవణన్ .. సాంబశివన్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
కథ విషయానికి వస్తే .. ఆరుగురు స్నేహితులు ఆనందంగా పార్టీ చేసుకుంటారు. అందరూ కూడా విపరీతంగా తాగేస్తారు. రాత్రివేళలో బయల్దేరతారు. మార్గ మధ్యంలో ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ సంఘటనతో వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావొచ్చని మేకర్స్ భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి