ప్రపంచంలోనే మేం మూడో అతిపెద్ద చమురు వినియోగదారు
డిల్లీ, 28 జూలై (హి.స.)లండన్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మాస్కో నుంచి భారత్‌ చమురు కొనుగోలు (Russia Oil Imports) చేయడంపై పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. దీనిపై న్యూదిల
ప్రపంచంలోనే మేం మూడో అతిపెద్ద చమురు వినియోగదారు


డిల్లీ, 28 జూలై (హి.స.)లండన్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మాస్కో నుంచి భారత్‌ చమురు కొనుగోలు (Russia Oil Imports) చేయడంపై పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. దీనిపై న్యూదిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తూనే ఉంది. తాజాగా యూకేలోని భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి దీనిపై స్పందిస్తూ.. పశ్చిమ దేశాల అభ్యంతరాలను మరోసారి తోసిపుచ్చారు. ఏ దేశం కూడా తమ సొంత ఆర్థిక వ్యవస్థకు ఆటంకం కలిగించుకోదని వెల్లడించారు.

బ్రిటన్‌ రేడియో స్టేషన్‌ ‘టైమ్స్‌ రేడియో’కు విక్రమ్‌ దొరైస్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసందర్భంగా రష్యా (Russia) నుంచి భారత్‌ చమురు దిగుమతులపై (Oil Imports) వస్తోన్న విమర్శలపై ఆయన స్పందించారు. ‘‘ప్రపంచంలోనే మేం మూడో అతిపెద్ద చమురు వినియోగదారులుగా ఉన్నాం. మా అవసరాల్లో 80శాతం వరకు దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం. అప్పుడు మేం రష్యా నుంచి డిస్కౌంట్‌పై వస్తోన్న చమురును కొనుగోలు చేయకుండా ఎలా ఉంటాం? మేం ఏం చేయాలని మీరు (పశ్చిమ దేశాలు) కోరుకుంటున్నారు. మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్‌ చేసుకోవాలా?’’ అని దొరైస్వామి ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande