శ్రీనగర్, 28 జూలై (హి.స.)జమ్మూకశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది. శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కనీసం ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. వీరు పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులని తెలుస్తోంది.
‘ఆపరేషన్ మహదేవ్ ’ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. చివరకు సోమవారం ఉదయం దాచిగమ్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా.. భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు