హైదరాబాద్, 28 జూలై (హి.స.)పహల్గామ్‌లో మారణహోమం సృష్టించిన ముష్కరులు హతమయ్యారు. సైన్యం చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు కుక్కచావు చచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సైన్యం అధికారికంగా ధృవీకరించినట్లు ఆలిండియా రేడియో వైబ్‌సైట్‌లో పేర్కొంది. దట్టమైన అడవీ ప్రాంతంలో ఒక డేరాలో వారు ఉన్నట్లుగా ఫొటోలో కనిపిస్తోంది. అస్సాల్ట్ రైఫిళ్లతో ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించాయి. చెట్ల మధ్య ఒక పెద్ద ఆకుపచ్చ దుప్పటి వేలాడుతూ కనిపించింది. తాత్కాలిక డేరాలో బట్టలు, దుప్పట్లు, ప్లాస్టిక్ సంచులు, ఆహారం, ప్లేట్ల చిందరవందరగా ఉన్న కుప్ప కనిపిస్తోంది.
భద్రతా దళాలు సోమవారం ‘ఆపరేషన్ మహాదేవ్’ ప్రారంభించింది. శ్రీనగర్ సమీపంలోని లిద్వాస్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు హతమయ్యారని భారత సైన్యం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు