మేక పాలు రోజు తాగితే ఎన్నో ప్రయోజనాలు.. విలువ తెలిస్తే అమృతం అంటూ ఇక వదిలిపెట్టరు..
కర్నూలు, 28 జూలై (హి.స.) ఛీ ఛీ మేక పాల అనకండి.. చాలా మంది ఆవు పాలు తాగుతారు.. గేదె పాలు కూడా తాగుతారు.. కానీ మేక పాలు తాగేవారు చాలా తక్కువమందే ఉంటారు.. కానీ ఆ పాలు ఎన్నో రకాలు మేలు చేస్తాయని మీకు తెలుసా..? ముఖ్యంగా ఎన్నో అనారోగ్యం సమస్యలకు మేక పాలు
మేక పాలు రోజు తాగితే ఎన్నో ప్రయోజనాలు.. విలువ తెలిస్తే అమృతం అంటూ ఇక వదిలిపెట్టరు..


కర్నూలు, 28 జూలై (హి.స.)

ఛీ ఛీ మేక పాల అనకండి.. చాలా మంది ఆవు పాలు తాగుతారు.. గేదె పాలు కూడా తాగుతారు.. కానీ మేక పాలు తాగేవారు చాలా తక్కువమందే ఉంటారు.. కానీ ఆ పాలు ఎన్నో రకాలు మేలు చేస్తాయని మీకు తెలుసా..? ముఖ్యంగా ఎన్నో అనారోగ్యం సమస్యలకు మేక పాలు చక్కని విరుగుడు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్న మాట..

మేక పాలు సులభంగా జీర్ణం అవుతాయి. అంతేకాకుండా చాలా మందికి ఎటువంటి సమస్యలు లేకుండా సరిపోతాయి. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా మేక పాలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి వివరంగా చెప్పారు. మేక పాలు తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సులువుగా జీర్ణం

ఈ పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల చాలా వేగంగా జీర్ణం అవుతాయి. తేలికగా అరిగే గుణం ఉండటంతో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావు.

అలర్జీలు తక్కువ

ఆవు పాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కానీ మేక పాలలో అలాంటి సున్నితమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల చాలా మంది అలర్జీ లేకుండా మేక పాలు తాగగలుగుతారు.

బలంగా ఎముకలు

కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు మేక పాలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా తయారు చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే ఎముకల బలహీనతను నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తికి బూస్ట్

మేక పాలలో ఉండే సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడతాయి. ఇది వైరల్ వ్యాధులు, ఫ్లూ వంటి వాటి నుంచి మనకు రక్షణ ఇస్తుంది.

చర్మ ఆరోగ్యానికి మేక పాలు

లాక్టిక్ యాసిడ్ అనే పదార్థం ఈ పాలలో ఉండటం వల్ల చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచడమే కాకుండా.. ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రింక్ అయినప్పటికీ.. కొందరికి ఇది సరిపడకపోవచ్చు. అందువల్ల మేక పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

---------------

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande