జమ్మూ కాశ్మీర్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం!
జమ్మూ కాశ్మీర్, 30 జూలై (హి.స.) జమ్ము కశ్మీర్లో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. పూంచ్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా పరిధి కస్లియాన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాద
ఎన్కౌంటర్


జమ్మూ కాశ్మీర్, 30 జూలై (హి.స.)

జమ్ము కశ్మీర్లో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. పూంచ్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా పరిధి కస్లియాన్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌ జరుగుతోంది. సరిహద్దు దాటి భారత్‌ వైపు చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదుల బృందాన్ని బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో నక్కివున్న ఉగ్రవాదుల కోసం సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande