న్యూఢిల్లీ: 30 జూలై (హి.స.)
పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆ పార్టీ ఎంపీ మనీశ్ తివారీ సామాజిక మాధ్యమాల్లో నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 1970లనాటి సినిమా పాటను జోడించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తివారీ.
మంగళవారం తివారీ ఎక్స్‌లో.. ఆపరేషన్ సిందూర్ చర్చలో ఎంపీలు శశి థరూర్, మనీష్ తివారీలకు కాంగ్రెస్ అవకాశమివ్వలేదంటూ వచ్చిన వార్తా కథనాన్ని జోడిస్తూ.. మనోజ్ కుమార్ నటించిన పూరబ్ ఔర్ పశ్చిమ సినిమాలోని ‘భారత్ కా రెహ్నా వాలా హూ, భారత్ కీ బాత్ సునాతా హూ’ అనే పాటను ఉటంకించారు. భారత వాసులారా.. భారత్ గురించి మీకు చెబుతా.. అని దీనర్థం. ఆపరేషన్ సిందూర్ అనంతరం విదేశాలకు పంపించిన దౌత్య బృందాల్లో భాగస్వాములుగా ఉన్న థరూర్, తివారీలకు పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చలో మాట్లాడే అవకాశముందంటూ వార్తలు రావడం తెల్సిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ