పార్లమెంటు ఆవరణలో విపక్ష ఇండియా కూటమి ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ, 30 జూలై (హి.స.) బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. దీనిపై వారం రోజులుగా పార్లమెంట్లో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపడుతున్నారు. వరుసగా ఎనిమిదో ర
పార్లమెంట్


న్యూఢిల్లీ, 30 జూలై (హి.స.)

బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. దీనిపై వారం రోజులుగా పార్లమెంట్లో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపడుతున్నారు. వరుసగా ఎనిమిదో రోజైన బుధవారం కూడా ఓటర్ల జాబితా సవరణపై విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు.

బుధవారం ఉదయం పార్లమెంట్ బయట ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. SIRను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. దీంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల అరెస్ట్లపై కూడా నిరసన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande