కమ్చట్కా , 30 జూలై (హి.స.)రష్యాలోని బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం(Earthquake In Russia) సంభవించింది. కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరంలోని సముద్రగర్భంలో సంభవించిన భూకంపం ప్రభావంతో సమీప ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయి ద్వీపసమూహం వరకూ.. అలాగే యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ తీరం వరకు సునామీ సైరన్ మోగింది. పసిఫిక్ సముద్ర తీరం వెంబడి అంతటా అధికారులు హై అలర్ట్‌లో జారీ చేశారు. హవాయిపై 10 అడుగుల ఎత్తులో రాకాసి అలలు విరుచుకుపడే అవకాశం ఉండటంతో ప్రజలు నగరాలను ఖాళీ చేస్తున్నారు. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జాం నెలకొంది. రష్యాతో పాటు జపాన్, అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు (Tsunami Threat) జారీ అయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి