టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పచ్చజెండా
దిల్లీ: 30 జూలై (హి.స.) జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (TRF)కు చెందిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడికి (Pahalgam Terror Attack) పాల్పడిన సంగతి తెలిసిందే. దీన్ని ఉగ్రసంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి
કેસ


దిల్లీ: 30 జూలై (హి.స.)

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (TRF)కు చెందిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడికి (Pahalgam Terror Attack) పాల్పడిన సంగతి తెలిసిందే. దీన్ని ఉగ్రసంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)ని భారత్ ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలు విధించేందుకు యూఎన్‌ఎస్సీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవలే దీన్ని అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

యూఎన్‌ఎస్సీ పర్యవేక్షణ కమిటీ తన తాజా నివేదికలో టీఆర్‌ఎఫ్‌ గురించి అధికారికంగా ప్రస్తావించింది. పహల్గాంలో జరిగిన దాడి ప్రదేశానికి సంబంధించిన ఫొటోను టీఆర్‌ఎఫ్‌ తన వెబ్‌సైట్లో ప్రచురించినట్లు అందులో తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తయిబా (LeT) మద్దతు లేకుండా ఈ దాడి జరగలేదన్న వాదనలను కూడా ప్రస్తావించింది. ఉగ్రవాద గ్రూపులు ప్రాంతీయ ఉద్రిక్తతలకు కారణమవుతాయని ఈసందర్భంగా హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ముందస్తు చర్యలు అవసరమని నొక్కి చెప్పింది. ఈ నివేదిక తదుపరి యూఎన్‌ఎస్సీ ఆంక్షల కమిటీ పరిశీలించనుంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande