సింధూ నదిలో పడిపోయిన ఐటీబీపీ బస్సు.
శ్రీనగర్‌: 30 జూలై (హి.స.) జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఐటీబీపీ(ఇండో-టిబెటియన్‌ బోర్డర్‌ పోలీసులు) ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వర్షాల కారణంగా అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పోలీసు సిబ్బందికి ఎల
సింధూ నదిలో పడిపోయిన ఐటీబీపీ బస్సు.


శ్రీనగర్‌: 30 జూలై (హి.స.)

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఐటీబీపీ(ఇండో-టిబెటియన్‌ బోర్డర్‌ పోలీసులు) ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వర్షాల కారణంగా అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పోలీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని గండేర్‌బల్ జిల్లాలో ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది, బస్సు డ్రైవర్‌ తప్పించుకున్నారు. అతి కష్టం మీద వారంతా బయటకు వచ్చారు. గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా సింధూ నది నీటిలో బస్సు మునిగిపోయింది.

అయితే, భారీ వర్షాల కారణంగా వాహనం అదుపుతప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande