సూళ్లూరుపేట, , 30 జూలై (హి.స.)
షార్‌లో ఈ రోజు బుధవారం సాయంత్రం 5.40 గంటలకు రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. జీఎ్‌సఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా ఇస్రో-నాసా ఉమ్మడిగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగ నేపథ్యంలో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. మన.. అమెరికా శాస్త్రవేత్తలతో పాటు ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగియింది. అన్నీ సజావుగా సాగితే నిర్దేశిత సమయంలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని రోదసిలోకి చేర్చనున్నారు. మరోవైపు భద్రతను కట్టుదిట్టం చేశారు. జలమార్గంలో కోస్టల్ గార్డులచే.. షార్ చుట్టూ పక్కల అడవుల్లో సీఐఎ్‌సఎఫ్ సిబ్బందితో జల్లెడ పడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి