ముంబయి 30 జూలై (హి.స.)
దేశీయ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 30 పాయింట్ల లాభంతో 81,368 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 12 పాయింట్లు ఎగబాకి 24,833 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు తగ్గి, 87.08గా ఉంది.
నిఫ్టీ సూచీలో లార్సెన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్, జియో ఫైనాన్షియల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, ఆసియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్యఒప్పందం కోసం జరుగుతోన్న చర్చలపై మదుపర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ