బళ్లారి, 4 జూలై (హి.స.)కర్ణాటక(Karntaka)లో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains)తో తుంగభద్ర డ్యామ్ వరద ప్రవాహంతో ఉప్పొంగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 36 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో తుంగభద్ర పరవళ్లు తొక్కుతుంది. ఈ క్రమంలో తుంగభద్ర డ్యామ్ 20 గేట్లను రెండున్నర అడుగులు పైకెత్తి 58,260 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ తరుణంలో ప్రస్తుతం డ్యాంలో 78.01 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. శివమొగ్గ జిల్లా తీర్ధ హళ్లిలో ఉన్న తుంగా జలాశయం కూడా నిండు కుండలా ఉండటంతో గేట్లను పైకెత్తి 34,990 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా తుంగభద్రకు వరద(Flood) పోటెత్తింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి