ఆగస్టు 1 నుంచి సుంకాలు చెల్లించాల్సిందే.. దేశాలకు ట్రంప్ వార్నింగ్
న్యూఢిల్లీ, 4 జూలై (హి.స.) ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్లపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా
దేశాలకు ట్రంప్ వార్నింగ్


న్యూఢిల్లీ, 4 జూలై (హి.స.)

ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్లపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.

అయితే తాజాగా డెడ్లైన్ దగ్గర పడుతుండడంతో ఆయా దేశాలకు అమెరికా లేఖలు పంపిస్తోంది. ఇదే అంశంపై విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఆగస్టు 1 నుంచి వాణిజ్య దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని.. ఈ మేరకు శుక్రవారం నుంచి లేఖలు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో అయితే అదనపు లేఖలు కూడా వస్తాయని పేర్కొన్నారు. వాణిజ్య భాగస్వామ దేశాలకు సుంకాల రేట్లను తెలియజేస్తూ లేఖలు ప్రారంభించినట్లు వెల్లడించారు. శుక్రవారం 10-12 దేశాలకు లేఖలు అందుతాయని.. 60-70 శాతం, 10-20 శాతం వరకు సుంకాలు ఉంటాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande