ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్, 4 జూలై (హి.స.) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో సీఎం రేవంత్ రెడ్డి నేడు భేటీ అయ్యారు. కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం గాంధీ భవన్లో పీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఖర్గే, కేసీ వేణుగ
సీఎం రేవంత్ రెడ్డి భేటీ


హైదరాబాద్, 4 జూలై (హి.స.)

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో సీఎం రేవంత్ రెడ్డి నేడు భేటీ అయ్యారు. కులగణన, బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం గాంధీ భవన్లో పీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. అనంతరం ఇరువురూ ఆఫీస్ బేరర్స్తో మాట్లాడుతారు. ఇప్పటికే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖర్గేతో తమ ఆవేదన చెప్పుకున్నారు. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సమాజిక సమర భేరి సభజరుగనుంది.

మరోవైపు.. పీఏసీ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనా చర్చిస్తారు. రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలని, అందుకు అందరూ పని చేయాలని ఈ సందర్భంగా ఖర్గే సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కీలక సూచనలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో విభేదాలు పరిష్కరించేందుకు చర్చలు జరిగినట్లు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande