చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 5 జూలై (హి.స.) చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై హైదరాబాద్ లో నిర్వహ
CM revanth reddy


హైదరాబాద్, 5 జూలై (హి.స.)

చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారికి అత్యంత కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. బాలికల సంరక్షణ కోసం తెలంగాణ ‘భరోసా’ ప్రాజెక్టును తీసుకొచ్చిందని.. అనుసంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande