నేడు హైదరాబాద్ కు రానున్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
హైదరాబాద్, 4 జూలై (హి.స.) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. శిల్పారామంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు.అల్లూరి సీతారామరాజు స్వా
Rajnath Singh


హైదరాబాద్, 4 జూలై (హి.స.)

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. శిల్పారామంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు.అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన పాత్రతో పాటు గిరిజన హక్కుల కోసం ఆయన పోరాడిన తీరు, బ్రిటీష్ పాలకులను వ్యతిరేకించిన చరిత్రకు గుర్తుగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.అల్లూరి శతజయంతి ఉత్సవాలు…అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుండటంతో ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ హాజరై ప్రసంగించనున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande