తుగ్గలి మండలం లోని పెండేకల్లు గ్రామానికి చెందిన ఓ రైతుకు మట్టి పనులు చేస్తున్న భూముల వజ్రం లభించింది
అమరావతి, 4 జూలై (హి.స.) తాజాగా తుగ్గలి మండలంలోని పెండేకల్లు గ్రామానికి చెందిన రోజువారీ కూలీ ఓ రైతు పొలంలో పనిచేస్తున్నాడు. మట్టి పనులు చేస్తున్న సమయంలో భూమిలో తనకు మిల మిల మెరిసిపోతున్న వజ్రం కనిపించింది. మొదట ఆయన సాధారణంగా ఉన్న రాయి అని అనుకున్నాడు
తుగ్గలి మండలం లోని పెండేకల్లు గ్రామానికి చెందిన ఓ రైతుకు మట్టి పనులు చేస్తున్న భూముల వజ్రం లభించింది


అమరావతి, 4 జూలై (హి.స.)

తాజాగా తుగ్గలి మండలంలోని పెండేకల్లు గ్రామానికి చెందిన రోజువారీ కూలీ ఓ రైతు పొలంలో పనిచేస్తున్నాడు. మట్టి పనులు చేస్తున్న సమయంలో భూమిలో తనకు మిల మిల మెరిసిపోతున్న వజ్రం కనిపించింది. మొదట ఆయన సాధారణంగా ఉన్న రాయి అని అనుకున్నాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న వజ్రాల వ్యాపారి దగ్గరికి వచ్చి తనకు భూమిలో దొరికిన రాయిని చూపించాడు. అది రాయి కాదని అత్యంత విలువగల వజ్రమని వ్యాపారి చెప్పాడు. తనకు ఆ వజ్రం రూ.10 లక్షలకి అమ్మాలని వ్యాపారి కోరాడు. కానీ కూలీ మాత్రం ఆ వజ్రాన్ని అమ్మడానికి ఒప్పుకోలేదు. బహిరంగ మార్కెట్లో ఆ వజ్రానికి రూ. 50 లక్షల పైగానే పలుకుతుందని కూలీ ఊహించాడు. వ్యాపారి ఎంతగా ఒత్తిడి తెచ్చినా కూలీ మాత్రం ఆ వజ్రం అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నాడు. అయితే కొద్దీ గంటల్లోనే వందలాది మంది ఆ వజ్రాన్ని చూడటానికి తరలి వచ్చారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande