మహోన్నతమైన వ్యక్తి మాజీ సీఎం కొణిజేటి రోశయ్య : హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి
హైదరాబాద్, 4 జూలై (హి.స.) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రోశయ్య 92 వ జయంతిని అధ
హైదరాబాద్ కలెక్టర్


హైదరాబాద్, 4 జూలై (హి.స.)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రోశయ్య 92 వ జయంతిని అధికారికంగా జరిపారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఉద్యోగంలోకి వచ్చారన్నారు. ఆయన చేపట్టిన ప్రతి పదవికి కూడా ఎంతో వన్నె తెచ్చారని, ఆర్థిక మంత్రిగా 16 సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. ఆరు దశాబ్దాలు ప్రజాసేవ అందించారని, మంచి వ్యక్తిత్వం గల మహోన్నతమైన వ్యక్తి అని ఆయన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande