రోశయ్య సేవలు మరువలేనివి : కామారెడ్డి జిల్లా కలెక్టర్
తెలంగాణ, కామారెడ్డి. 4 జూలై (హి.స.) ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రోశయ్య 4వ జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
కామారెడ్డి కలెక్టర్


తెలంగాణ, కామారెడ్డి. 4 జూలై (హి.స.)

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,

దివంగత నేత కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రోశయ్య 4వ జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కొనిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2009 నుంచి 2010 సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తదనంతరం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్ గా పని చేయడమే కాకుండా చాలా పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసి తన రాజకీయ అనుభవంతో ప్రజలకు విశేష సేవ చేశారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande