హైదరాబాద్, 4 జూలై (హి.స.)
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కొలుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
'తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారన్న వార్త కలచివేసింది. ఆయన త్వరగా కోలుకొని పూర్తిస్థాయి ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను' అంటూ మంత్రి ట్వీట్ చేశారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యంపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీశారు. ఈ నేపథ్యంలోనే సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. కేసీఆర్కు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్