పది లో అత్యధిక మార్కుల సాధనకు విద్యార్థులు కష్టపడాలి : నారాయణపేట కలెక్టర్
తెలంగాణ, నారాయణపేట 4 జూలై (హి.స.) గురుకుల పాఠశాలలకు చెందిన పదోతరగతి విద్యార్థులు అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మరికల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కోటకొండ మహాత్
నారాయణపేట కలెక్టర్


తెలంగాణ, నారాయణపేట 4 జూలై (హి.స.)

గురుకుల పాఠశాలలకు చెందిన పదోతరగతి విద్యార్థులు అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మరికల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కోటకొండ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నత విద్యాభ్యాసానికి పదోతరగతి తొలిమెట్టని పేర్కొన్నారు. 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించేందుకు కష్టపడాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ శ్రీలతతో మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను, వారికి సరిపడే తరగతి గదులు, మరుగుదొడ్లు వివరాలను ఆరా తీశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande