'బొగ్గు,ఇసుక లారీలతో ప్రాణాలు కోల్పోతున్నాం.. కలెక్టర్ కు గ్రామస్తుల విజ్ఞప్తి
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 4 జూలై (హి.స.) బొగ్గు, ఇసుక లారీలతో తమ ప్రాణాలు పోతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాజుపేట గ్రామస్థులు రోడ్డుపై వాహనాలను నిలుపుదల చేసి ని
భద్రాద్రి కలెక్టర్


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 4 జూలై (హి.స.)

బొగ్గు, ఇసుక లారీలతో తమ ప్రాణాలు పోతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాజుపేట గ్రామస్థులు రోడ్డుపై వాహనాలను నిలుపుదల చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నిత్యం బొగ్గు, ఇసుక లారీలతో తమ ప్రాణాలు కోల్పోతున్నామని వాపోయారు. గ్రామంలో విపరీతమైన కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని తమ గోడు విన్నవించుకున్నారు.లారీలు అధిక స్పీడుతో వస్తున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బొగ్గు, ఇసుక లారీలతో తమ ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పుకొస్తున్నారు.కలెక్టర్ గారు మీరైన పట్టించుకోని తమ గ్రామానికి న్యాయం చేయాలని రాజుపేట గ్రామస్థులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande