హైదరాబాద్, 4 జూలై (హి.స.)
ఖనిజాల ఉత్పత్తిలో కోల్ ఇండియా
కీలక పాత్ర పోషిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ప్రపంచ మైనింగ్ సదస్సులో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆత్మ నిర్బర్కు కోల్ ఇండియా అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. స్థానికుల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా కోల్ ఇండియా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అత్యాధునిక సాంకేతికత వినియోగించి ఖనిజాలు ఉత్పత్తి చేయబోతున్నామని అన్నారు. ఖనిజాల తవ్వకంలో కోల్ ఇండియా పారదర్శంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 500 మినరల్ బ్లాక్స్ లీజ్ రెన్యువల్ సులభతరం అవుతోందని చెప్పారు. లీజ్ రెన్యూవల్కు సింగిల్ విండో సిస్టం అందుబాటులోకి తచ్చిందని వెల్లడించారు. దీంతో అరుదైన ఖనిజాల ఉత్పత్తిలోకి కూడా కోల్ ఇండియా అడుగుపెట్టిందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్